'బెస్ట్ టీచర్ అవార్డుకు దరఖాస్తు చేసుకోండి'

E.G: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 28తో ముగియనున్నట్లు జిల్లా డీఎస్ఈవో వాసుదేవరావు పేర్కొన్నారు. పదేళ్లు పూర్తిచేసిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తమ దరఖాస్తు, వివరాలను సంబంధిత డీఈవో వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. ప్రతి మండలం నుంచి ఎస్జీటీ కేడర్లో 10 మంది ఉపాధ్యాయులను, స్కూలు అసిస్టెంట్ కేడర్లో 5 మంది ఉపాధ్యాయులు మించకుండా అందజేయాలన్నారు.