'మా ఓట్లు అమ్మట్లేదు' ఇంటి గోడపై పోస్టర్!

'మా ఓట్లు అమ్మట్లేదు' ఇంటి గోడపై పోస్టర్!

WGL: 'మా ఓట్లు అమ్మడం లేదు' అంటూ ఇంటి గోడపై ఓటర్లు ఓ పోస్టర్ అతికించిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో జరిగింది. నల్లబెల్లి మండలంలో రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమ ఓటు ఎవ్వరికీ అమ్మబోమని స్పష్టం చేస్తూ గ్రామ ఆదర్శ రైతు రాధాకృష్ణ పోస్టర్ అతికించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అయ్యింది.