క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే
మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది మృతిచెందగా, మిగిలినవారు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నాగార్జున రెడ్డి పరామర్శించారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు.