1466 మంది పోలీసులకు అవార్డులు.. కేంద్రం ప్రకటన
రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పోలీసు సిబ్బందికి ప్రతిష్టాత్మక 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్' అవార్డులను ప్రకటించింది. మొత్తంగా 1,466 మంది పోలీసులకు ఈ అవార్డులు లభించాయి. ప్రత్యేక ఆపరేషన్లు, దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాలలో అసాధారణ ప్రతిభ చూపిన పోలీసులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది.