అడవులను కాపాడుకుందాం: FDO

MNCL: అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిని జన్నారం మండల అటవీశాఖ ఎఫ్‌డీవో రామ్మోహన్ అన్నారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. అభయారణ్యంలో అనేక పక్షులు వన్యప్రాణులు ఉన్నాయన్నారు. వాటి సంరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అడవులకు వన్యప్రాణులకు నష్టం చేసే విధంగా ఎవరు ప్రవర్తించవద్దని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.