VIDEO: సరస్వతి బ్యారేజీలో పెరుగుతున్న వరద ప్రవాహం

BHPL: మహదేవపూర్(M) కాళేశ్వరంలోని అన్నారం సరస్వతి బ్యారేజీలో సోమవారం వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. నీటిపారుదల శాఖ అధికారులు 1,91,484 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైనట్లు తెలిపారు. సుందిళ్ల పార్వతి బ్యారేజీ నుంచి 1,67,588 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 2,45,616 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.