కరెంట్ కోతలపై రైతుల అందోళన
KMR: వేసవి కాలం ఆరంభానికి ముందే కరెంటు కష్టాలు మొదలయ్యాయి. గత వారం రోజుల నుంచి మండలంలోని పద్మాజివాడి సబ్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలకు సరఫరా కరెంటులో కోతలు విధిస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. ముడేగాం, పద్మాజీవాడి రైతులు తమ పంటలకు కరెంట్ సరఫరాలో 2 నుంచి 3 గంటలు కోతలు విడిస్తున్నారని పేర్కొన్నారు.