ప్రమాదకరంగా మారిన ప్రైవేట్ స్కూల్ వాహనాలు

ప్రమాదకరంగా మారిన ప్రైవేట్ స్కూల్ వాహనాలు

NTR: నందిగామలోని ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపించారు. వ్యాన్లలో డోర్లు తెరిచి అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకుంటున్నారని, ఇది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమేనని వారు పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని, యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.