పోలేరమ్మ సేవలో ఎమ్మెల్యే

పోలేరమ్మ సేవలో ఎమ్మెల్యే

GNTR: కాకుమాను మండలం కొండపాటూరులో శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్లు జరుగుతున్నాయి. మంగళవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అమ్మవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నియోజకవర్గ ప్రజలందరిపై ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ప్రార్థించారు.