రూ.100 తగ్గిన పత్తి ధర

వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఈరోజు మళ్లీ రైతన్నలకు నిరాశ మిగిల్చాయి. సోమవారం రూ. 6,930 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ. 7,050కి పెరిగింది. ఈరోజు మళ్లీ తగ్గి రూ. 6,950కి పడిపోయింది. ఒకరోజు వ్యవధిలోనే పత్తి ధర రూ.100 తగ్గడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా చూడాలని కోరుతున్నారు.