విజయవాడలో గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం

NTR: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీసీలు, రైతులు, కార్మికుల హక్కుల పరిరక్షణకు లచ్చన్న చేసిన కృషిని వారు కొనియాడారు. ఆయన సేవలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వక్తలు అన్నారు.