భారతీయుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత: మోదీ

భారతీయుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత: మోదీ

యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారతీయుల భద్రతే ప్రథమ ప్రాధాన్యతగా తీసుకున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 3,75,000 మంది భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారని వెల్లడించారు. దాడుల్లో కొంతమంది భారతీయులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌కు వచ్చే నౌకల మార్గం సుగమానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే హర్మూజ్ జలసంధి నుంచి కొన్ని నౌకల దాటివచ్చాయన్నారు.