పెన్షన్లపై దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొండపల్లి

పెన్షన్లపై దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొండపల్లి

AP: పెన్షన్లపై YCP నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ హయాంలోనే 10 లక్షల పెన్సన్లు తొలగించారని, తమ హయాంలో కొత్తగా 65 లక్షల పెన్షన్లు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం అనర్హులకు దివ్యాంగ పెన్షన్లు ఇచ్చిందని పేర్కొన్నారు. 80 వేల మంది అనర్హులను గుర్తించి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. అనర్హుల పెన్షన్లు కేటాయించిన వారిని విచారిస్తామన్నారు.