దళారులను నమ్మి మోసపోవద్దు: ఏఎంసీ ఛైర్మన్
NZB: హున్సా సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ చిల శంకర్ ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా తమ పంటను ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, నాగయ్య, సావిత్రి గంగాధర్, రవి, హన్మంత్ రావు పాల్గొన్నారు.