శివశంకర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

శివశంకర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

KMR: జిల్లా ఉగ్రవాయి శివారులో జరిగిన శివశంకర్ హత్య కేసును పోలీసులు 96 గంటల్లోనే ఛేదించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. నిందితులు శ్రీనివాస్ గౌడ్, భాగ్యలక్ష్మిలను అరెస్ట్ చేసి, వారి నుంచి కత్తి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వేగంగా దర్యాప్తు పూర్తి చేసిన పోలీస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు.