జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి మృతి
ఖమ్మం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి దామల నాగరాజు మృతి చెందారు. నేలకొండపల్లి మండలం అనాసాగర్లో నాగరాజు స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒత్తిడికి గురయ్యాడు. నిన్న సాయంత్రం అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.