కార్యకర్తలకు ప్రమాద బీమా అండ: ఎమ్మెల్యే
సత్యసాయి: టీడీపీ కార్యకర్తలకు కష్టం వస్తే పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. నల్లచెరువు మండలం కే. పులకుంటకు చెందిన రోడ్డు ప్రమాద మృతుడు షేక్ షకీర్ కుటుంబానికి రూ.5,00,000 బీమా పత్రాన్ని అందజేశారు. కేవలం వంద రూపాయలతో ప్రమాద బీమా కల్పించిన ఏకైక పార్టీ టీడీపీ అని ఎమ్మెల్యే తెలిపారు..