'జడ్పీటీసీ ఉప ఎన్నికలకు భారీ బందోబస్తు'

KDP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు SP అశోక్ కుమార్ తెలిపారు. పులివెందులలో జరిగిన ఘటనల నేపథ్యంలో పలువురిపై కేసులు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. పోలీసులు ఇచ్చిన గ్రామాల్లోనే ప్రచారం నిర్వహించాలి తప్ప మరో గ్రామంలో నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. దాదాపు 500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.