రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

WGL: వరంగల్-చింతలపల్లి రైల్వే స్టేషన్‌ మధ్య లేబర్ కాలనీ సమీపంలో సోమవారం స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ ఢీకొని సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మృతురాలి వద్ద పసుపు తాడు, రెండు మంగళసూత్రాలు, చెవులకు కమ్మలు, చేతికి వెండి, రాగి కడియాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తింపు ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో భద్రపరిచారు.