అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

విశాఖపట్నం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించిన అనాథ మృతదేహానికి అవర్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసుల సమాచారంతో స్పందించిన సంస్థ ప్రతినిధి పిల్లి గోవిందరాజు తన సొంత నిధులతో దహన సంస్కారాలు పూర్తి చేయించారు. ఈ సేవలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.