గుడ్‌న్యూస్.. విశాఖ- కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం- కేరళలోని కొల్లం మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపటి నుంచి జనవరి 21 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రతి మంగళవారం విశాఖ- కొల్లం, ప్రతి బుధవారం కొల్లం- విశాఖపట్నం రైళ్లు రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట మీదుగా నడుస్తాయని పేర్కొంది. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ బోగీలతో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.