పత్తి చేనులో పుర్రె, ఎముకలు
NLG: దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ పొలంలో మనిషి పుర్రె, ఎముకలు కనిపించిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. పత్తి తెంపడానికి వచ్చిన కూలీలు పుర్రె, ఎముకలు చూసి పొలం యజమానికి తెలపడంతో యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.