మృతుల కుటుంబాల నివాసానికి టీపీసీసీ చీఫ్
HYD: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మృతుల కుటుంబాల నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు.