రోడ్డు విస్తరణ పనులతో ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు :ఎమ్మెల్యే శంకర్

రోడ్డు విస్తరణ పనులతో  ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు :ఎమ్మెల్యే శంకర్

మహబూబ్ నగర్: షాద్ నగర్ పట్టణ పాత జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనుల విషయంలో ప్రజలను ఎవరూ ఇబ్బందులకు గురి చేసే ప్రసక్తేలేదని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం రహదారి రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించి అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ.. ప్రజలకు, భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రత్యామ్నాయ చర్యలతో రోడు పనులు జరగాలన్నారు.