VIDEO: అక్రమంగా తరలిస్తున్న ఆవులు పట్టివేత
MNCL: అక్రమంగా తరలిస్తున్న ఆవులను చెన్నూర్ మండలంలోని కిష్టంపేట వై జంక్షన్ వద్ద సోమవారం పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మహారాష్ట్రలో కొనుగోలు చేసి మందమర్రికి తరలిస్తున్న ఆవులను పట్టుకొని లింగంపల్లిలోని గోశాలకు తరలించారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ దేవేందర్ రావు తెలిపారు.