గ్యాస్ సరఫరాపై అపోహలు ప్రచారం చేస్థే కఠిన చర్యలు
WGL: జిల్లాలో గ్యాస్ సరఫరాపై అపోహలు వ్యాప్తి చేయవద్దని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సూచించారు. బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. అపోహలను ఆసరాగా చేసుకుని గ్యాస్‌ను బ్లాక్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో సమన్వయ కమిటీలతో సమావేశాలు నిర్వహించి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు.