బాసర అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ గాయని
NRML: ప్రముఖ గాయని ఎస్.జానకి తన కుటుంబ సభ్యులతో కలిసి బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ ఏఈవో శ్రీనివాస్, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆమె రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.