ఎరువుల షాపులపై వ్యవసాయ అధికారుల దాడులు

ELR: కామవరపుకోట, తడికలపూడి గ్రామాలలో ఎరువుల షాపులపై వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కామవరపుకోటకు చెందిన మూడు షాపుల్లో ఎరువుల నిల్వలలో వ్యత్యాసం ఉన్న కారణంగా స్టాక్ నిల్వలను నిలుపుదల చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా తెలిపారు. వారితోపాటు చింతలపూడి వ్యవసాయ సంచాలకులు వై.సుబ్బారావు పాల్గొన్నారు.