నేడు పాలేరులో మంత్రి పర్యటన
KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో పర్యటించనున్నారని ఆయన క్యాంపు కార్యాలయం ఇంఛార్జ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ఆయన భేటీ అవుతారని తెలిపారు.