VIDEO: రైతు పుట్టినరోజు వేడుక.. యూరియా బస్తా బహుమతి

SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో శుక్రవారం మారు కిషన్ రెడ్డి అనే రైతు పుట్టినరోజు వినూత్నంగా జరిపారు. ఆయన మిత్రులు యూరియా బస్తా బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా కొరత ఉన్నందున మనిషికి ఓ యూరియా బస్తా ఇస్తున్న తరుణంలో ఓ యూరియా బస్తా పుట్టినరోజు బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.