మాదకద్రవ్యాల నియంత్రణపై సమీక్ష
PDPL: పెద్దపల్లి కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డి.వేణు మాదకద్రవ్యాల నియంత్రణపై శనివారం సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. టీనేజ్ పిల్లలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు క్షుణ్నంగా పరిశీలించాలన్నారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్‌ను ఉపయోగించుకోవాలన్నారు.