చరిత్రకు అడుగు దూరంలో స్టార్ బ్యాటర్
బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ వందో టెస్ట్ ఆడుతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అతడు 99 పరుగులతో ఉన్నాడు. ఇంకో రన్ తీస్తే టెస్ట్ క్రికెట్ చరిత్రలో వందో మ్యాచ్‌లో 100 పరుగులు చేసిన 11వ ఆటగాడిగా నిలుస్తాడు. అలాగే, టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు 83 మంది 100 టెస్టులు పూర్తి చేసుకోగా బంగ్లా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ ముష్ఫికర్ మాత్రమే.