చిరుత పులి పిల్లలు కలకలం

చిరుత పులి పిల్లలు కలకలం

చిత్తూరు: గుడిపాల మండల పరిధిలోని కనకనేరి అటవీ ప్రాంతంలో చిరుత పులి పిల్లలు సంచారం కలకలం రేపుతుంది. చిరుత పులి పిల్లలను గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత పులి పిల్లలు సంచరించడంతో పెద్ద చిరుత పులి కూడా ఉంటుందని స్థానికులు భయాందొలనకు గురవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.