‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలోని నున్న గ్రామంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని, నిధుల జమపై ఆరా తీశారు. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.