'వైసీపీ కమిటీలు త్వరగా పూర్తి చేయాలి'

'వైసీపీ కమిటీలు త్వరగా పూర్తి చేయాలి'

విశాఖ జిల్లా వైసీపీ కార్యాలయంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకుటి చందు ఆధ్వర్యంలో యువజన విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు హాజరై, వార్డు-సచివాలయం స్థాయిలో పార్టీ కమిటీలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి స్థాయిలో కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.