'వ్యక్తిగత పరిశుభ్రత తోనే ఆరోగ్యం'

'వ్యక్తిగత పరిశుభ్రత తోనే ఆరోగ్యం'

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జడ్పీ హై స్కూల్ ఆవరణలో బుధవారం స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.