వేసవి సెలవుల్లో జాగ్రత్త: ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరిక
GDWL: వేసవి సెలవుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ సూచించారు. ఇంటి దొంగతనాల నివారణకు నగలు, నగదును బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, సీసీ కెమెరాలను మొబైల్‌కు అనుసంధానించాలని కోరారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్ చేయాలని పేర్కొన్నారు.