VIDEO: తణుకులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

W.G: తణుకులో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా తణుకు పరిసర ప్రాంతాల్లో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.