నేటి నుంచి సహకార వారోత్సవాలు ప్రారంభం
ప్రకాశం: జిల్లాలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలను ఈనెల 14 నుంచి 20వ తేది వరకు జిల్లా సహకార శాఖ అధ్వర్యంలో నిర్వహించనున్నట్లు జిల్లా కోఆపరేటివ్ అధికారి డి శ్రీలక్ష్మి తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్‌లను ఒంగోలులో గురువారం జిల్లా కలెక్టర్ రాజా బాబు అవిష్కరించారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాలలో 7 రంగుల సహకార పతాక ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు.