ఆలూరులో కూలిన ఇల్లు.. పరిశీలించిన ఎంపీడీవో

NZB: ఆలూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో గంగాధర్ శనివారం విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో ఒక ఇల్లు కూలిపోవడంతో బాధిత కుటుంబాన్ని పునరావాస కేంద్రానికి తరలించి అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. స్వయంగా పరిశీలించిన ఎంపీడీవో గ్రామస్థులను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.