'సింగిల్ యూజ్ కవర్లు వాడితే చర్యలు తీసుకుంటాం'

BPT: అద్దంకి పట్టణ పరిసర ప్రాంతాలలోని ప్రజలందరూ సింగిల్ యూజ్ కవర్లను వినియోగించవద్దని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర గురువారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిపై పూర్తిగా నిషేధ విధించిందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ తర్వాత ఎవరైనా వ్యాపారస్తులు సింగిల్ యూజ్ కవర్లను అమ్మితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రవీంద్ర హెచ్చరించారు.