అమ్మకు మన సారా.. మన సారే

NRML: దస్తూరాబాద్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఆర్యవైశ్య సంఘం మహిళలు వనిత శక్తి ఒడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వారికి ఒడి బియ్యం పోసి ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ.. శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ శ్రీశ్రీ శివస్వామీజీ ఆదేశం మేరకు 'మన అమ్మకు మనసారా మన సారే' కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.