జిల్లాలో మొదలైన టెన్త్ పరీక్షల సందడి

TPT: తిరుపతి జిల్లాలో 10వ తరగతి పరీక్షల సందడి మొదలైంది. జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకుంటున్నారు. మొదటి రోజు కావడంతో విద్యార్థులతోపాటూ వారి తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఈ మేరకు విద్యార్థులకు అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు.