నులిపురుగుల నివారణతో ఎన్నో సమస్యలకు పరిష్కారం: కలెక్టర్

SRD: నులిపురుగుల నివారణతో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఆల్బజెండర్ మాత్రలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యుల సమక్షంలోనే మాత్రలను పిల్లలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విద్యాసాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.