'పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'

'పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'

AKP: కశింకోట మండలంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది శత శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలని ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం సుందరయ్య పేట, తాళ్లపాలెం, జి. భీమవరం గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూలు చేశారు. పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.