VIDEO: ఇళ్లలోకి చేరిన నీరు.. అధికారులు అప్రమత్తం

సత్యసాయి: ధర్మవరంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో కేతిరెడ్డి కాలనీలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు వీఆర్వో రవి శేఖర్ రెడ్డి ప్రాంతానికి వెళ్లి అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని హామీ ఇస్తూ, తన ఫోన్ నంబర్ అందజేసి ఏ సమస్య వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని వార్డులోని ప్రజలకు సూచించారు.