పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
ASF: జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా ఎస్పీ నీతిక పంత్ తెలిపారు. జిల్లాలోని తిర్యాని పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి మండలంలోని శాంతిభద్రతల పరిస్థితిని స్థానిక ఎస్సై వెంకటేష్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బందీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు.