కొబ్బరి రైతులకు నిరాశ... తగ్గుతున్న ధర

కొబ్బరి రైతులకు నిరాశ... తగ్గుతున్న ధర

కోనసీమ: జిల్లాలో కొబ్బరికాయ ధర రోజు రోజుకి పతనం అవుతుండడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం రూ.18 నుంచి రూ.20 వరకు ఉన్న కొబ్బరికాయ ధర పలకగా ఇవాళ రూ.16కి పడిపోయిందని వ్యాపారస్తులు అంటున్నారు. మహాశివరాత్రి పండుగ వస్తున్న సందర్భంగా ధర పెరుగుతుందనుకున్న రైతులకు నిరాశే మిగిలింది.