కాలువలో మునిగి బాలుడు మృతి
GNTR: దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్ (13) అనే బాలుడు బకింగ్‌హామ్ కాల్వలో మునిగి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన ఇమ్రాన్ స్నేహితులతో కలిసి కాల్వలో ఈతకు వెళ్లాడు. ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అరగంట తర్వాత యువకులు మృతదేహాన్ని వెలికితీసి తల్లిదండ్రులకు అప్పగించారు.