రాజాంలో 12న అప్రెంటీస్ షిప్ మేళా
VZM: రాజాం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రముఖ కంపెనీ EID PARRY’S (INDIA) PVT LTD వారు నవంబర్ 12న అప్రెంటీస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బి.భాస్కరావు శుక్రవారం తెలిపారు. అప్రెంటీస్ షిప్ మేళాకు ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 9573574643 సంప్రదించాలన్నారు.